నాని బర్త్ డే స్పెషల్

Saturday,February 24,2018 - 09:01 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఒకే ఒక్క హీరో నాని. నేచురల్ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ హీరో ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. టాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీస్ అంతా నానికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.

అసిస్టెంట్ డైరక్టర్ గా సినీకెరీర్ ప్రారంభించిన నాని, అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత అలా మొదలైంది, పిల్ల జమీందార్ సినిమాలతో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.


నాని కెరీర్ లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఈగ. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నానికి మంచి పేరుతీసుకొచ్చింది. ఈగ తర్వాత వరుసగా ఫ్లాపులు చూసినప్పటికీ.. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు.


ఎవడే సుబ్రమణ్యం సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ఎంసీఏ వరకు వరుసగా హిట్స్ కొడుతూనే ఉన్నాడు నాని. ఈ రెండు సినిమాలతో కలుపుకొని బ్యాక్ టు బ్యాక్ 9 హిట్స్ ఇచ్చాడు. వీటిలో ఎంసీఏ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం ఈ హీరో కృష్ణార్జున యుద్ధం సినిమాను విడుదలకు సిద్ధంచేశాడు. ఏప్రిల్ 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. త్వరలోనే శ్రీరామ్ ఆదిత్య, అవసరాల శ్రీనివాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నాడు. మరోవైపు “అ!” సినిమాతో నిర్మాతగా కూడా మారిన నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది జీ సినిమాలు.