షూటింగ్ పూర్తిచేసుకున్న 'మెహబూబా'

Saturday,February 24,2018 - 10:07 by Z_CLU

తనయుడు ఆకాష్ హీరోగా పూరి జగన్నాధ్ డైరక్ట్ చేస్తూ, నిర్మిస్తున్న చిత్రం మెహబూబా. గ్యాప్ లేకుండా, వరుస షెడ్యూల్స్ తో కొనసాగిన ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. హైదరాబాద్ లో గడిచిన 4 రోజులుగా చేసిన ప్యాచ్ వర్క్ తో షూటింగ్ కంప్లీట్ అయినట్టు యూనిట్ ప్రకటించింది.

తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇండో-పాక్ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో మెహబూబా సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాధ్. వార్ బ్యాక్ డ్రాప్ లో ఓ హై-ఎమోషనల్ లవ్ ను ప్రజెంట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో కొడుకు ఆకాష్ ను ఫుల్ లెంగ్త్ కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నాడు. ఈమధ్యే ఏపీ, నైజాం, అమెరికాలో 800కు పైగా థియేటర్లలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా మెహబూబా సినిమా థియేటర్లలోకి రానుంది.