Tuck Jagadish - హిట్ పక్కా అంటున్న నాని
Friday,April 02,2021 - 02:58 by Z_CLU
– సినిమా ఫైనల్ కట్ చూసుకున్నాం కాబట్టి టీమ్ అందరిలో తెలియని ఓ ఎగ్జయిట్మెంట్ నిండిపోయింది. ఎడిట్ రూమ్ నుంచి బయటకు రాగానే ఫంక్షన్‌లో ఎలా మాట్లాడుతామో.. డైరెక్టర్ శివ నిర్వాణతో అలా మాట్లాడాను. ఫిక్సయిపో..బ్లాక్‌బస్టర్ అని చెప్పాను. అలాంటి ఓ ఎగ్జయిట్‌మెంట్ ఉంది.

– కెరీర్ పరంగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది. ఈ ఏప్రిల్ నెలకు మంత్ ఆఫ్ జగదీష్ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా పెట్టాం. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చాలా కార్యక్రమాలున్నాయి. ఈ సమ్మర్.. సినిమా పరిశ్రమకు చాలా కీలకం అనే సంగతి తెలుసు. అందరం కోవిడ్ నుంచి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళుతున్నాం.
– ఇది మన తెలుగు సినిమా, మన నెటివ్ సినిమా. మన మట్టి వాసన ఉన్న సినిమా అనేలా ఫ్లేవర్‌తో రేర్‌గా సినిమా వస్తుంటుంది. ఫుల్ ఎమోషనల్ డ్రామా. మన తెలుగు సినిమా. పదిహేనేళ్ల క్రితం ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం మన ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసేవాళ్లమో అలాంటి ఎగ్జయిట్‌మెంట్‌ను ఇచ్చే సినిమా ‘టక్ జగదీష్’.

– అందరితో కలిసి ఫస్ట్ డే మార్నింగ్ షో చూసే వరకు ఈ ఎగ్జయిట్మెంట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సినిమాలోని ఓ `రా` నెస్‌ను సినిమాటోగ్రాఫర్ ప్రసాద్‌గారు అద్భుతంగా చిత్రీకరించారు. రియలిస్టిక్‌గా ఉంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన సినిమా ఇది. రేర్‌గా కుదిరే సినిమా.
– తమన్‌తో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాం. ఇప్పటికీ కుదిరింది. ఈ సినిమాకు తనకంటే బెస్ట్ సంగీతం ఎవరూ చేయలేరనపించేలా మ్యూజిక్ ఇచ్చాడు. కథలో ఎమోషన్స్‌ను అర్థం చేసుకుని తమన్ సంగీతాన్ని అందించాడు. సినిమా చాలా బాగా ఉంది. లడ్డులా ఉంటుంది.

– రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. కానీ టీజర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేదు. ట్రైలర్‌లో మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఉగాది పండగ సందర్భంగా మా సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 13న వైజాగ్‌లో విడుదల చేస్తున్నాం. టీజర్ కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ సంతోషాన్ని ప్రేక్షకులకు ఇస్తుంది. అలాగే ఈ నెల 18న హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశాం.