Pushpa 2 ప్లానింగ్ మారింది ... రిలీజ్ ఎప్పుడు ?

Tuesday,October 11,2022 - 01:31 by Z_CLU

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో రానున్న ‘పుష్ప 2’ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అక్టోబర్ నెలాఖరున లేదా నవంబర్ నుండి రెగ్యులర్ షూట్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ సీక్వెల్ కి సంబంధించి ప్లానింగ్ మారింది. నిజానికి ‘పుష్ప ది రైజ్’ రిలీజైన వెంటనే పుష్ప 2 షూట్ స్టార్ట్ చేయాల్సింది కానీ స్క్రిప్టులో మార్పుల కారణంగా కొంత టైం తీసుకున్నాడు సుకుమార్. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకు ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా టైం తీసుకున్నాడు. ఇక పుష్ప రిలీజ్ టైంలో పార్ట్ 2 వచ్చే ఏడాది ఇదే డేట్ కి రిలీజ్ అంటూ చెప్పుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో ఇప్పుడు పుష్ప ది రూల్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.

అయితే వచ్చే ఏడాది సమ్మర్ లోపే షూట్ కంప్లీట్ చేసి మే7న ఆర్య రిలీజ్ రోజు సినిమాను రిలీజ్ చేసే ప్లానింగ్ ఉన్నారనే ఓ టాక్ వినిపిస్తుంది. కానీ ఇది సాధ్యం కాకపోవచ్చు. సుకుమార్ మేకింగ్ స్టైల్ చాలా స్లో గా ఉంటుంది. మేకింగ్ లో పర్ఫెక్షనిస్ట్ గా కనిపిస్తాడు. నెలలు దాటి ఏడాది పైనే సినిమా తీస్తుంటాడు. అందుకే ఇన్నేళ్ళ కెరీర్ లో సుక్కు సినిమాలు వేళ్ళ మీద లేక్కేయొచ్చు. పైగా పుష్ప ది రూల్ పై బాలీవుడ్లో కూడా భారీ అంచనాలున్నాయి. మరి ఇవన్నీ ఆలోచించి సుకుమార్ ఇంకా ఎక్కువే టైం తీసుకోవడం ఖాయమనిపిస్తుంది. సమ్మర్ మిస్ అయితే మాత్రం వచ్చే ఏడాది డిసెంబర్ లో ‘పుష్ప’ రిలీజ్ డేట్ కే ఈ సీక్వెల్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. చూడాలి ‘పుష్ప 2’ అల్లు అర్జున్ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చేదేప్పుదో మరి.