మొన్న నర్తనశాల... ఈసారి అశ్వద్ధామ?

Monday,June 03,2019 - 11:41 by Z_CLU

తన సినిమాలకు వెరైటీ పేర్లు పెడుతున్నాడు హీరో నాగశౌర్య. మొన్నటికిమొన్న నర్తనశాల అనే డిఫరెంట్ టైటిల్ పెట్టిన ఈ హీరో, ఇప్పుడు అశ్వద్ధామ అనే మరో వెరైటీ టైటిల్ పై ఫోకస్ పెట్టాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే తన అప్ కమింగ్ మూవీకి ఇదే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారు.

సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకే అశ్వద్ధామ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. గతంలో పెట్టిన నర్తనశాల, తాజాగా కన్సిడర్ చేస్తున్న అశ్వద్ధామ సినిమాలు రెండూ మహాభారతానికి సంబంధించిన పదాలే.

సినిమాకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకు స్వయంగా నాగశౌర్య కథ రాసుకున్నాడు. ఆ సబ్జెక్ట్ ను రమణతేజ చేతిలో పెట్టాడు.