ఖరీదైన బహుమతి అందుకున్న నాగశౌర్య

Tuesday,February 27,2018 - 01:51 by Z_CLU

ఛలోతో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య.. ఇప్పుడు మరో సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా అందుకున్నాడు. ఈ సినిమా నిర్మాత, నాగశౌర్య తల్లి ఉషా మల్పూరి తనయుడికి కాస్ట్ లీ కారును గిఫ్ట్ గా అందించారు. సొంత బ్యానర్ లో కొడుకు నాగశౌర్యను హీరోగా పెట్టి తొలి ప్రయత్నంగా తీసిన ఛలో సూపర్ హిట్ అవ్వడంతో.. తన ఆనందాన్ని ఇలా షేర్ చేసుకున్నారు నిర్మాత ఉష.

కేవలం నాగశౌర్య ఒక్కడికే కాదు.. యూనిట్ లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో బహుమతులు అందాయి. ఛలో సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా యూనిట్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి డబ్బు, బహుమతుల రూపంలో ప్రోత్సహకాలు అందించారు. ఇక దర్శకుడు వెంకీ కుడుములకు అయితే ఏకంగా ఓ కారు దక్కింది.

ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాగశౌర్య… త్వరలోనే తన నెక్ట్స్ మూవీని ఎనౌన్స్ చేయబోతున్నాడు. అటు ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై కూడా కొత్త సినిమాను ప్రకటించే ప్లాన్స్ లో ఉన్నారు.