సాయి పల్లవి ఇంటర్వ్యూ

Tuesday,February 27,2018 - 02:20 by Z_CLU

మొదటి సినిమా ‘ఫిదా’ తో ప్రేక్షకులు ఫిదా అయ్యేంతలా మ్యాజిక్ చేసింది సాయి పల్లవి. ఇప్పుడు  ‘కణం’ సినిమాతో మరోసారి మెస్మరైజ్ చేయబోతున్న సాయిపల్లవి, ఈ సినిమాలో రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా భార్య పాత్రలో కనిపించనుంది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని చెప్పుకున్న సాయి పల్లవి, మరెన్నో విషయాలు షేర్ చేసుకుంది అవి మీకోసం…

 అదే ‘కణం’  సినిమా…

కంప్లీట్ గా  తల్లి కూతుళ్ళ చుట్టూ తిరిగే కథ ‘కణం’ సినిమా. ఆ ఇద్దరి రిలేషన్ షిప్, ఇమోషన్స్ చుట్టూ సినిమా ఉండబోతుంది.

మొదట్లో అర్థం కాలేదు…

డైరెక్టర్ విజయ్ గారు నాకు కథ చెప్పినపుడు షాక్ అయ్యాను. తల్లి రోల్ ప్లే చేయాలి అన్నప్పుడు   మొదట్లో అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే కథ విన్నానో చాలా ఎగ్జైటెడ్ అయ్యాను.

 

 అనుభవం లేదు…

తల్లి  రోల్ లో నటించాలి అనగానే అంత ఈజీ కాలేదు. ఆ ఇమోషన్స్ ని ఎలా ప్రెజెంట్ చేయాలి. ఇప్పటివరకు నాకు అలాంటి అనుభవం  లేదు. కానీ ఎప్పుడైతే స్టోరీ డిస్కషన్ లో వెరోనిక తో పాటు టైమ్ స్పెండ్ చేయడం మొదలు పెట్టానో,  నిజంగానే మేమిద్దరం తల్లీ కూతుళ్ళమనే ఫీల్ వచ్చింది. మీరు స్క్రీన్ పై చూడబోయే ప్రతి ఇమోషన్ రియల్ అనిపిస్తుంది.

క్రెడిట్ డైరెక్టర్ కే…

డైరెక్టర్ విజయ్ కి ఈ సినిమాలో ఏం కావాలి..? ఎంత కావాలి అనే క్లారిటీ బిగినింగ్ నుండి ఉంది. ఒక్కోసారి సెట్ లో కొన్ని సందర్భాల్లో ఈ ఇమోషన్ ని కొంచెం హెవీ గా ప్రెజెంట్ చేస్తే బావుంటుందని సజెస్ట్ చేసినా, ఒప్పుకునే వాడు కాదు. అప్పటికప్పుడు నాకు తన విజన్ అర్థం కాకపోయినా, డబ్బింగ్ చెప్పేటప్పుడు స్క్రీన్ పై చూస్తే పర్ఫెక్ట్ అనిపించింది.

 

నాకు చాలా స్పెషల్….

మనం చేసే సినిమాలు జస్ట్ ఆడియెన్స్ కోసమే కాదు.. మన సంతృప్తి కోసం కూడా చేస్తుంటాం. ‘కణం’ సినిమా అలాంటిదే. చాలా ఇష్టపడి చేశానీ సినిమాని…

గుర్తుండిపోయే సినిమా…

కొన్ని సినిమాలు జస్ట్ ఎంటర్ టైన్ చేయడమే   కాకుండా ఆడియెన్స్ పై గ్రేట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి. ‘కణం’ మూవీ కూడా అలాంటిదే. సినిమా చూశాక ప్రతి ప్రేక్షకుడిలో గొప్ప ఫీల్ మిగిలిపోతుంది….

ఏడ్చేశాను…

ఒకసారి దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఒక ఫ్యాన్ నా దగ్గరికి వచ్చి చాలా ఇమోషనల్ అయ్యాడు. నన్నింకా ‘మలార్’ గానే ట్రీట్ చేశాడు. ఆ మూమెంట్ తనని చూసి నేను కూడా ఏడ్చేశాను. ఇంత ప్రేమ చూస్తుంటే ఇప్పడు నాది చాలా పెద్ద ఫ్యామిలీ అనిపిస్తుంది.

సక్సెస్ తెచ్చిన కష్టాలు…

ఫస్ట్ సినిమాతోనే ఇంత మంది అభిమానం పొందగలిగాను. అందుకే ఫ్యూచర్ సినిమాలు ఎంచుకునేటప్పుడు చాలా ఆలోచిస్తాను. తక్కువ సినిమాలు చేసినా ప్రాబ్లమ్ లేదు కానీ, ఫ్యాన్స్ మాత్రం డిజప్పాయింట్ అవ్వడానికి వీల్లేదు…

 

డెసిషన్ మేకింగ్ ముఖ్యం…

ఒక సినిమాకి నో అని చెప్పినంత మాత్రాన ఆ సినిమా ఆగిపోదు. మన ప్లేస్ లో ఇంకొకరు ఆ రోల్ చేస్తారు. అలాగని వచ్చిన ప్రతి సినిమాలో నటించలేము. కాబట్టి ఒక సినిమాని ఒప్పుకున్నా, రిజెక్ట్ చేసినా రీజన్ ఉండాలి. జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి.

తమిళ సినిమాలు…

ధనుష్ తో మారి-2, సూర్య–సెల్వ రాఘవన్ సినిమా చేస్తున్నా…