మరో సినిమా ఎనౌన్స్ చేసిన నాగశౌర్య

Thursday,September 19,2019 - 12:46 by Z_CLU

హీరో నాగశౌర్య చేతిలో ఇప్పటికే 3 సినిమాలున్నాయి. ప్రస్తుతం సొంత బ్యానర్ పై అశ్వద్ధామ సినిమా చేస్తున్న నాగశౌర్య, మరోవైపు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఫలానా అబ్బాయ్-ఫలానా అమ్మాయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు సుబ్రమణ్యపురం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో పార్థు అనే సినిమా కూడా చేయబోతున్నాడు. ఇప్పుడీ 3 సినిమాలకు అదనంగా మరో సినిమా ప్రకటించాడు.

లక్ష్మీ సౌజన్యను డైరక్టర్ గా పరిచయం చేస్తూ ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు నాగశౌర్య. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. అక్టోబర్ నుంచే సెట్స్ పైకి వస్తుందని, వచ్చే ఏడాది మే నెలలో రిలీజ్ చేస్తామని కూడా మేకర్స్ ప్రకటించారు.

ప్రస్తుతం అశ్వద్ధామ, ఫలానా అబ్బాయ్-ఫలానా అమ్మాయ్ సినిమాల్ని సైమల్టేనియస్ గా చేస్తున్నాడు శౌర్య. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత లక్ష్మీ సౌజన్య సినిమా సెట్స్ పైకి వస్తుంది. సో.. సంతోష్ జాగర్లపూడి సినిమా ఇంకాస్త ఆలస్యం అవుతుందన్నమాట.