అఫీషియల్ : గోపీచంద్ తో సంపత్ నంది సినిమా

Thursday,September 19,2019 - 12:06 by Z_CLU

ప్రస్తుతం ‘చాణక్య’తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న గోపీచంద్ లేటెస్ట్ గా బిను సుబ్రహ్మణ్యం అనే కొత్త దర్శకుడితో  సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు మ్యాచో హీరో. మొన్నటి వరకూ సంపత్ నందితో గోపీచంద్ సినిమా ఉంటుందనే వార్త చక్కర్లు కొట్టింది. ఇప్పుడీ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసారు మేకర్స్.

మొన్నీ మధ్య వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘గౌతమ్ నంద’ అనుకున్నంత విజయం అందుకోలేదు. అందుకే మళ్ళీ జోడీ కట్టి ప్రేక్షకులను ఓ స్పోర్ట్స్ డ్రామాతో మెప్పించాలని చూస్తున్నారు. ఈ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను స్టార్ట్ చేసి సెట్స్ పైకి తీసుకురానున్నాడు గోపీచంద్. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.