Naga Chaitanya అరడజను సినిమాలతో బిజీ

Tuesday,May 31,2022 - 12:55 by Z_CLU

Naga Chaitanya next with this directors

అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ దర్శకత్వంలో ‘ధూత’ అనే సిరీస్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘థాంక్యూ’ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా తర్వాత చైతూ చేయబోయే లిస్టు పెద్దగానే ఉంది.  విక్రమ్ ప్రభు దర్శకత్వంలో తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత లేదా ఏకకాలంలో పరశురాంతో ‘నాగేశ్వరరావు’ చేయబోతున్నాడు చైతు. ఇటివలే దర్శకుడు పరశురాం కూడా తన నెక్స్ట్ సినిమా చైతుతోనే అంటూ చెప్పుకున్నాడు.

ఇక తరుణ్ భాస్కర్ కూడా చైతు కోసం స్క్రిప్ట్ రెడీ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు. సురేష్ ప్రొడక్షన్ బేనర్ పై సురేష్ బాబు నిర్మించనున్న ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక చైతు లిస్టులో కిషోర్ తిరుమల , రాహుల్ సంక్రిత్యాన్ వంటి దర్శకులు కూడా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్స్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ చైతు కోసం వీళ్ళు కూడా కథలు రెడీ చేస్తున్నారు.

త్వరలోనే ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు చైతు. ఆ సినిమా తర్వాత ఇక బాలీవుడ్ సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టనున్నాడు. బంగార్రాజు తో సూపర్ హిట్ అందుకున్న చైతు నెక్స్ట్ థాంక్యూ ఏ రేంజ్ హిట్ సొంతం చేసుకుంటాడో చూడాలి.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics