Gopichand Sriwass Movie - హీరోయిన్ ఫిక్స్?

Wednesday,July 21,2021 - 06:45 by Z_CLU

శ్రీవాస్ డైరెక్షన్ లో గోపీచంద్ తన 30వ సినిమా చేయబోతున్న సంగతీ తెలిసిందే. ఇటివలే ఎనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆగస్ట్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ని ఫైనల్ చేసుకున్నారట మేకర్స్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస ఆఫర్స్ అందుకున్న నభా ప్రస్తుతం వరుస అపజయాలతో కెరీర్ ని నడిపిస్తుంది.

nabha natesh new stills zeecinemalu

నితిన్ ‘మాస్ట్రో’ తర్వాత ఆమె చేయబోతున్న సినిమా ఇదేనని సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ మారుతీ దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే మారుతీ సినిమాను కంప్లీట్ చేసి శ్రీవాస్ తో సినిమాను మొదలు పెట్టనున్నాడు గోపీచంద్. శ్రీవాస్ -గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన ‘లక్ష్యం’,’లౌఖ్యం’ రెండూ మంచి విజయాలు అందుకున్నాయి. మళ్ళీ ఇన్నేళ్ళకి ఈ కాంబోలో రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి.

nabha natesh in yellow saree

కలకత్తా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ పై విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలోనే హీరోయిన్ నభా నటేష్ కి ప్రాజెక్ట్ లోకి వెల్కం చెప్పి ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మరి గోపీచంద్ సరసన నభా క్యారెక్టర్ ఎలా ఉంటుంది ? ఇస్మార్ట్ శంకర్ తరహాలో మాస్ టచ్ ఉన్న రోల్ లో కనిపిస్తుందా ? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసి ఆ విషయాన్ని కూడా చెప్పనున్నారు మేకర్స్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics