RRR Promotional Song - మగధీర టచ్
Wednesday,July 21,2021 - 06:39 by Z_CLU
రాజమౌళి ఏది చేసినా ఓ ప్లానింగ్ ప్రకారం ప్రమోషన్ కి ఉపయోగపడేలా ఉంటుంది. ప్రమోషన్ కి ఉపయోగపడే ఏ ఒక్క అవకాశాన్ని జక్కన్న విడిచి పెట్టడు. ఆఖరికి రోలింగ్ టైటిల్స్ లో కూడా కొంత ఖర్చు పెట్టి సాంగ్ షూట్ చేసి పెడతాడు. ఇప్పుడు #RRR రోలింగ్ టైటిల్స్ కోసం కూడా అలాంటి ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. తారక్ , చరణ్ లతో పాటు అలియా మిగతా నటీనటులంతా ఇందులో డాన్స్ చేస్తూ కనిపిస్తారు. ‘మగధీర’ రోలింగ్ టైటిల్స్ లో వచ్చే సాంగ్ లాగే దీన్ని డిజైన్ చేశారని తెలుస్తుంది.
ఆర్టిస్టులతో పాటు సినిమా కోసం కష్టపడిన టెక్నీషియన్స్ అందరూ ఈ సాంగ్ లో కనిపించే అవకాశం ఉందని సమాచారం. అలాగే స్పెషల్ అప్పిరియన్స్ కూడా ఒకటి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. ఆ స్పెషల్ అప్పిరియన్స్ ని ప్రభాస్ చేయించాలని చూస్తున్నాడట రాజమౌళి. సాంగ్ లో తారక్ , చరణ్ లతో కలిసి ప్రభాస్ స్టెప్స్ వేసి RRR ప్రమోషన్స్ లో భాగం కానున్నడని ఇన్సైడ్ టాక్.

RRR సినిమా ఓపెనింగ్ కి కూడా మెగా స్టార్ చిరంజీవి తో కలిసి స్పెషల్ గెస్ట్ గా ఎటెండ్ అయ్యాడు ప్రభాస్. ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చాడు. ఇప్పుడు మరో సారి ప్రమోషనల్ సాంగ్ లో ఇద్దరితో కలిసి స్క్రీన్ పై కనిపించబోతున్నాడు. ప్రభాస్ ఎప్పిరియన్స్ తో తెరకెక్కనున్న ఈ సాంగ్ ని రిలీజ్ కి ముందే వదిలి నార్త్ లో కూడా హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నాడు రాజమౌళి. ఆ సాంగ్ ని సినిమా రోలింగ్ టైటిల్స్ లో వేసి శుభం కార్డు వేయనున్నారట. మరి ఈ ప్రమోషనల్ సాంగ్ లో ఒక్క ప్రభాస్ మాత్రమే కనిపిస్తాడా ? ‘బాహుబలి’ లో నటించిన అనుష్క , రానా కూడా కనిపిస్తారా ? చూడాలి.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics