మోసగాళ్లు ఫస్ట్ లుక్.. మంచు బర్త్ డే స్పెషల్

Saturday,November 23,2019 - 11:49 by Z_CLU

ఈరోజు మంచు విష్ణు పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న హాలీవుడ్ క్రాస్ ఓవ‌ర్ మూవీకి `మోస‌గాళ్లు` అనే టైటిల్ ఖ‌రారు చేసి సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఇందులో మంచు విష్ణు అర్జున్ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఐటీ రంగంలో జ‌రిగిన ప్ర‌పంచ అతి పెద్ద స్కామ్ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సినిమా నిర్మిత‌మ‌వుతోంది. జెఫ్రీ గిచిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రుహానీ సింగ్ స‌హా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


వెరొనికా మంచు నిర్మాత‌గా రాబోతున్న ఈ థ్రిల్ల‌ర్ కు సంబంధించి ఇప్ప‌టికే హైద‌రాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. తొలి షెడ్యూల్‌లో మంచు విష్ణు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.  2020 వేస‌విలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.