నవంబర్ 29న తూటా

Saturday,November 23,2019 - 12:31 by Z_CLU

హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తొలిసారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎనై నోకి పాయుమ్ తోట. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో అనువదిస్తున్నారు. మేఘ ఆకాష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇందులో అతిథి పాత్రలో కనిపించాడు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కు దర్భుక శివ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస, ఎస్ఆర్ కాథిర్, జామన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈమధ్యే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది.

సినిమా నవంబర్ 29న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. విజయభేరి వారి బ్యానర్ పై జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.