హాట్ టాపిక్: RRRలో మలయాళ సూపర్ స్టార్?

Tuesday,April 07,2020 - 03:02 by Z_CLU

రాజమౌళి దర్శకత్వంలో మోస్ట్ ఏవైటింగ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న RRR గురించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటికొచ్చింది. ఇప్పటికే సినిమాలో అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ ఉండగా తాజాగా ఇప్పుడు మళయాళం సూపర్ స్టార్ కూడా జాయిన్ అవ్వనున్నారనేది ఆ రూమర్.

సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారట. తారక్ కి బాబాయ్ క్యారెక్టర్ లో ఆయన కనిపిస్తారనే టాక్ వినిపిస్తుంది.

తాజాగా ఈ రోల్ కోసం రాజమౌళి మోహన్ లాల్ ను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ లో ఓ కీ-రోల్ చేశారు మోహన్ లాల్. మళ్లీ ఇప్పుడు తారక్ తో కలిసి నటించనున్నారట. త్వరలోనే మోహన్ లాల్ రోల్ పై పూర్తి క్లారిటీ రానుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న సినిమా థియేటర్స్ లోకి వస్తోంది RRR.