ఎమ్మెల్యే మూవీ ఫస్ట్ సింగిల్ రివ్యూ

Tuesday,March 13,2018 - 11:08 by Z_CLU

ఇవాళ్టి నుంచి ఎమ్మెల్యే హంగామా షురూ అయింది. లాంగ్ గ్యాప్ తర్వాత కల్యామ్ రామ్, కాజల్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మార్కెట్ లో మంచి బజ్ ఉంది. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టుగానే “హే ఇందు” అనే లిరిక్స్ తో ఉన్న సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా విడుదల చేశారు

మణిశర్మ ఈ పాటకు ట్యూన్ కట్టగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఇచ్చాడు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో లై సినిమా నుంచి బొంబాట్ అనే బ్లాక్ బస్టర్ సాంగ్ వచ్చింది. ఆ పాటకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ నయా సింగిల్ ఉంది. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ గా పాడాడు ఈ పాటని.

ఉపేంద్ర మాధవ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై భరత్ చౌదరి, కిరణ్ కలిసి నిర్మిస్తున్నారు. మార్చి 23న ఎమ్మెల్యే సినిమా థియేటర్లలోకి రానుంది.