Middle Class Melodies - రికార్డ్ వ్యూస్

Monday,November 16,2020 - 02:01 by Z_CLU

ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మిడిల్ క్లాస్ మెలొడీస్. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రయిలర్ సోషల్ మీడియాలో సూపర్ హిట్టయింది. విడుదలైన 5 రోజులకే 10 మిలియన్ వ్యూస్ సాధించింది ఈ ట్రయిలర్. పెద్దగా స్టార్ ఎట్రాక్షన్ లేని ఈ సినిమాకు ఈ స్థాయిలో వ్యూస్ అంటే అది మామూలు విషయం కాదు.

చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ఎలిమెంట్స్ తో కొత్త కుర్రాడు వినోద్ అనంతోజు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆ ఫ్రెష్ ఫీలింగ్, కొత్తదనం ట్రయిలర్ లో కూడా కనిపించింది. అందుకే అంతలా హిట్టయింది.

మరో 4 రోజుల్లో ఓటీటీలో రిలీజ్ అవుతోంది Middle Class Melodies. ఇప్పటికే ట్రయిలర్ పెద్ద హిట్టవ్వడంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఆనంద్ దేవరకొండకు ఇది రెండో సినిమా.