Payal - పల్లెటూరి పిల్ల పాత్రలో ముద్దుగుమ్మ

Monday,November 16,2020 - 08:41 by Z_CLU

అర్థరాత్రి.. అనుకోని పరిస్థితులు.. ఓ చిన్న ఇల్లు.. ఊహించని అతిథి ఎంట్రీ.. దీంతో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆ రాత్రి ఏం జరిగింది? ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది అనగనగా ఓ అతిథి మూవీ.

Payal Anaganaga o athidhi 2

బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో పాయల్ తో పాటు చైత‌న్య కృష్ణ, న‌టులు ఆనంద్ చ‌క్ర‌పాణి, వీణ సుంద‌ర్ కీలక పాత్రలు పోషించారు. దయాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 20న ఓటీటీలో రిలీజ్ అవుతుంది.

ట్రెండ్ లౌడ్ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై రాజా రామ్ మూర్తి, చిదంబ‌రం న‌టీస‌న్ ఈ సినిమాను నిర్మించారు.

Payal Anaganaga o athidhi 3

ఆరెక్స్ 100 వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్, ఆర్ డి ఎక్స్ ల‌వ్, డిస్కోరాజా సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ సోంత‌ ఇమేజ్ తెచ్చుకున్న పాయల్ ఇప్పుడు అన‌గ‌న‌గా ఓ అతిధితో మ‌రోసారి ఆడియెన్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి రెడీ అవుతుంది. ఈ సినిమాలో ఆమె డీ-గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించబోతోంది.