ఆర్ఆర్ఆర్ అప్ డేట్స్

Tuesday,March 05,2019 - 07:01 by Z_CLU

రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్ట్స్ షెడ్యూల్ ను మరింత పెద్దగా ప్లాన్ చేశాడు రాజమౌళి. ఇన్నాళ్లూ హైదరాబాద్ లోనే షూటింగ్ చేసిన యూనిట్, ఫస్ట్ టైం రాష్ట్రం దాటి బయటకు వెళ్లబోతోంది.

అవును.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం ఈసారి కేరళను ఫిక్స్ చేశాడు రాజమౌళి. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టించబోతున్నాడు. ఏకథాటిగా 40 రోజుల పాటు సాగే షెడ్యూల్ ఇది. హీరోలిద్దరూ పాల్గొనే అతిపెద్ద షెడ్యూల్ కూడా ఇదే కానుంది.

ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్తపడుతున్నాడు రాజమౌళి. అందుకే 2 షెడ్యూల్స్ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క స్టిల్ కూడా బయటకు లీక్ కాలేదు. మరోవైపు ఈ సినిమా స్టోరీలైన్ ఏంటనే విషయంపై కూడా రాజమౌళి క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతోపాటు హీరోయిన్లు ఎవరనే మేటర్ ను కూడా సస్పెన్స్ గా ఉంచాడు. కేరళ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఏదో ఒక అంశంపై క్లారిటీ వస్తుందంటున్నారు.