'మళ్లీ రావా' కు 'క్లీన్ యు' సర్టిఫికెట్

Thursday,November 30,2017 - 10:21 by Z_CLU

స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రదారులుగా గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలోరాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా ‘మళ్లీ రావా’. ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 8న విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది.. ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ పొందింది.

ఈ సందర్భంగా మధురా శ్రీధర్ మాట్లాడుతూ మళ్లీ రావా ఓ బ్యూటీఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ.. మా మధురా మ్యూజిక్ ద్వారా ఆడియో ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’. చిత్రానికి సంగీతం అందించిన శ్రవణ్… మళ్లీ రావా కు కూడా అందించారు.. 3 స్టేజెస్ లో లవ్ స్టొరీ రాసుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమా సుమంత్ కు కమ్ బ్యాక్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను.. ఈ స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసుకునే విషయంలో నే తెలిసింది ప్రొడ్యూసర్ కు ఉన్న టేస్ట్… అని చెప్పారు.

డైరెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ శ్రవణ్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి సోల్ అవుతుంది, ఇటీవలే మ్యూజిక్ ను వైజాగ్ లో విడుదల చేయడం జరిగింది.. మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందని అన్నారు.

నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ ఈ సినిమా స్క్రిప్ట్ ఎంత బాగుంటుందో మ్యూజిక్ కూడా అంతే అద్భుతంగా ఉంది. ఈ చిత్రానికి ‘క్లీన్ యూ’ సెన్సార్ సర్టిఫికెట్ రావడం ఆనందంగా ఉంది. సెస్సార్ వారు ఈ సినిమా చూసి అప్రిషియేట్ చేశారు.సినిమా డిసెంబర్ 8న విడుదల కానుందని చెప్పారు.

సుమంత్, ఆకాక్ష, సింగ్, అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తిక్ అడుసుమల్లి, మాస్టర్ సాత్విక్, బేబీ ప్రీతి ఆస్రాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: సతీష్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఎడిటింగ్: సత్య గిడుతూరి, లిరిక్స్: కృష్ణ కాంత్, నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క, కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: గౌతమ్ తిన్న సూరి.