Mahesh Prabhas - క్వారంటైన్ లోకి స్టార్ హీరోలు

Friday,April 23,2021 - 06:21 by Z_CLU

టాలీవుడ్ ను కరోనా గట్టిగా తాకింది. ఇప్పటికే కల్యాణ్ దేవ్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నాడు. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా తమ సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. కరోనా సోకలేదు కానీ, ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

ప్రభాస్
రీసెంట్ గా రాధేశ్యామ్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ వెంటనే ప్రభాస్ మేకప్ మేన్ కు కరోనా సోకింది. దీంతో ప్రభాస్ కూడా ముందుజాగ్రత్తగా హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాడు. దీంతో రాధేశ్యామ్ సినిమా మరింత లేట్ అవుతోంది.

మహేష్
సూపర్ స్టార్ కూడా ఉగాది సందర్భంగా సర్కారువారి పాట సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ మొదలైంది. అంతలోనే యూనిట్ లో ఐదుగురికి కరోనా సోకింది. దీంతో షూటింగ్ ఆపేశారు. మహేష్ హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాడు. మళ్లీ ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు.

రామ్ చరణ్
అటు రామ్ చరణ్ కూడా ఐసొలేషన్ లోనే ఉన్నాడు. చరణ్ పర్సనల్ డ్రైవర్ కు కరోనా సోకింది. దీంతో మెగాపవర్ స్టార్ కు ఐసొలేషన్ తప్పలేదు. చరణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లడం ఇది వరుసగా రెండోసారి. RRR, ఆచార్య సినిమాలపై ఈ ప్రభావం కచ్చితంగా పడుతుంది.

చిరంజీవి
అటు చిరంజీవి కూడా మరోసారి హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఆచార్య షూటింగ్ లో నటుడు సోనూసూద్ కు కరోనా సోకింది. దీంతో షూటింగ్ ఆపేసి అంతా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అటు సోనూసూద్ కు కరోనా నెగెటివ్ వచ్చింది. ఆ విషయాన్ని ఈరోజు సోనూ స్వయంగా ఎనౌన్స్ చేశాడు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics