మహేష్ తో గీతా ఆర్ట్స్.. డైరెక్టర్ ఎవరంటే?

Wednesday,April 15,2020 - 11:14 by Z_CLU

తన 27వ సినిమాను పరశురాం డైరెక్షన్ లో చేయబోతున్నాడు సూపర్ స్టార్. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఒకేసారి 2 సినిమాలు ఎనౌన్స్ చేస్తానని గతంలోనే మహేష్ ప్రకటించాడు. ఇప్పటికే వంశీ పైడిపల్లి , త్రివిక్రమ్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి.

కానీ మహేష్ తన 28 సినిమాను కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. అవును ‘KGF’తో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న ప్రశాంత్… ఆ మధ్య మహేష్ కి కథ వినిపించాడట. ఇప్పుడు అదే కథతో వీరిద్దరూ ఓ బై-లింగ్వెల్ సినిమా చేస్తారని టాక్..

ఈ కాంబినేషన్ ను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తారని సమాచారం. మహేష్ గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయాలని ఒప్పందం ఉంది. అందుకోసం మహేష్ కి అల్లుఅరవింద్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ‘KGF చాప్టర్ 2’ బిజీ గా ఉన్న ప్రశాంత్ ఆ సినిమా పూర్తయ్యాక మహేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ చేస్తాడట.