డేట్ ఫిక్స్ చేసిన సూపర్ స్టార్

Wednesday,April 15,2020 - 12:58 by Z_CLU

‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని వెయిట్ చేసారు ఫ్యాన్స్. అయితే లేటెస్ట్ గా తన 27వ సినిమాకు డైరెక్టర్ ని ఫిక్స్ చేసుకున్నాడు సూపర్ స్టార్. పరశురాం (బుజ్జీ) తో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.

అదే రోజు సినిమా టైటిల్ రివీల్ చేస్తూఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసి అభిమానుల్లో జోష్ తీసుకురాబోతున్నాడు మహేష్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా లాక్ డౌన్ పూర్తయిన తర్వాత సెట్స్ పైకి రానుంది.

మహేష్ కోసం ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఉన్న యాక్షన్ సబ్జెక్ట్ ను రెడీ చేశాడు పరశురామ్. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ నెరేషన్ కూడా పూర్తయింది. టోటల్ స్క్రీన్ ప్లే చదివిన మహేష్, ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.