సూపర్ స్టార్ ల్యాండ్ అయ్యాడు

Tuesday,November 17,2020 - 07:36 by Z_CLU

ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న వెకేషన్ ను పూర్తిచేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. లాక్ డౌన్ టైమ్ లో పూర్తిగా ఇంట్లో ఉండిపోయిన ఈ హీరో.. కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లాడు.

Mahesh Dubai 5

తనకు టైమ్ దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లడం మహేష్ కు ఎంతో ఇష్టం. ఈసారి కూడా భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి దుబాయ్ వెళ్లాడు. అక్కడే ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు.

Mahesh Dubai 4

దుబాయ్ ట్రిప్ కు సంబంధించిన ఫొటోల్ని నమ్రత ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది. కుటుంబంతో కలిసి అన్నీ మరిచిపోయి మహేష్ హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఫొటోలు నెట్ లో వైరల్ అయ్యాయి.

Mahesh Dubai 2

వెకేషన్ లో భాగంగా గౌతమ్-సితార కొత్తకొత్త ప్రదేశాలు చుట్టేశారు. కాంటినెంటల్ రుచులు కూడా ట్రై చేశారు. సితార అల్లరితోనే మహేష్ కు టైమ్ సరిపోయింది.

Mahesh Dubai 6

అలా లాంగ్ గ్యాప్ తర్వాత వెకేషన్ కు వెళ్లిన మహేష్.. దుబాయ్ పర్యటన పూర్తిచేసుకొని హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. త్వరలోనే రెండు యాడ్ షూటింగ్స్ పూర్తిచేసి, జనవరి నుంచి సర్కారువారి పాట సినిమా కోసం అమెరికా వెళ్లబోతున్నాడు మహేష్.