KothiKommachi - స్పెషల్ సాంగ్ రెడీ

Tuesday,November 17,2020 - 06:54 by Z_CLU

జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో మేఘామ్ష్ , సమీర్ వేగేశ్న లు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కోతి కొమ్మచ్చి’. యూత్ ఫుల్ ఫన్ లోడెడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో Nandini Rai హాట్ అందాలతో కుర్రకారుని ఎట్రాక్ట్ చేయడానికి రెడీ అవుతుంది.

ప్రస్తుతం అమలాపురంలో ఈ సాంగ్ షూట్ జరుగుతుంది. నందిని రాయ్ తో పాటు యువ హీరోలు మేఘమ్ష్ , సమీర్ లు చిందేస్తున్నారు.

Lakshya Productions బ్యానర్ పై MLV సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వేగేశ్న సతీష్ -అనూప్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ఆల్బం మంచి ఆదరణ పొందడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. త్వరలోనే అమలాపురం షెడ్యుల్ పూర్తి చేసి వెంటనే విశాఖపట్నంలో షూట్ స్టార్ట్ చేయబోతున్నారు.