తాజా వార్తలు
Monday,May 13,2019 - 12:00 by Z_CLU
“నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌ను వన్ వీక్‌లో దాటేయబోతున్నాం. దీనికి మించిన ఆనందం నాకు లేదు. ఆడియన్స్, నా అభిమానులకు హ్యాట్సాఫ్. ముందుగా నరేష్ గారికి థాంక్స్.. ఎందుకంటే, ఆయన ఈ క్యారెక్టర్‌ను చేస్తాడా? అనుకున్నాను. కానీ.. ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. వంశీ గురించి చాలా విషయాలే చెప్పాను. కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా అభిమానులు, నాన్నగారి అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగుతారని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. ఇప్పుడు నేను కూడా కాలర్ ఎత్తుకుంటున్నాను.”
“ఈ సినిమా మూడేళ్ల ప్రాసెస్. మరచిపోలేని అనుభవాలున్నాయి. దిల్‌రాజు గారు తొలిసారి కథ విని క్లాసిక్ అన్నారు. నాకు ఫోన్ చేశారు. గత ఏడాది దత్తుగారు కథ విని, ఈ సినిమా ఓ గేమ్ చేంజర్ అవుతుంది ప్రిన్స్ అన్నారు. డబుల్ చేంజర్ చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. నేను క్రికెట్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌ని. 2011 వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లాను. చివర్లో దోని సిక్స్ కొట్టినప్పుడు చాలా సంతోషపడ్డాను. అప్పుడు ఎంత ఆనందం వేసిందో దిల్‌రాజుగారు సిక్సర్ కొట్టాం అనగానే అంతే ఆనందం వేసింది.“