మహర్షి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,May 13,2019 - 12:10 by Z_CLU

మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కిన మహర్షి సినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకు కళ్లుచెదిరే వసూళ్లు వస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ లో (4 రోజులకు) ఈ సినిమాకు 49 కోట్ల 13 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాంలో చాలా ప్రాంతాల్లో నాన్-బాహుబలి రికార్డులు సృష్టిస్తోంది మహర్షి. వరల్డ్ వైడ్ ఇప్పటికే 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల రూపాయల షేర్ టచ్ చేయబోతోంది. ఇక నైజాం విషయానికొస్తే, 4 రోజుల్లోనే 16 కోట్ల మార్క్ టచ్ చేసిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది మహర్షి.

ఏపీ,నైజాం ఫస్ట్ వీకెండ్ (4 రోజుల) షేర్
నైజాం – రూ. 16.62 కోట్లు
సీడెడ్ – రూ. 6.18 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 6.13 కోట్లు
ఈస్ట్ – రూ. 4.92 కోట్లు
వెస్ట్ – రూ. 3.74 కోట్లు
గుంటూరు – రూ. 5.90 కోట్లు
నెల్లూరు – రూ. 1.75 కోట్లు
కృష్ణా – రూ. 3.63 కోట్లు