వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ఫిక్స్ !

Sunday,January 26,2020 - 01:16 by Z_CLU

‘ఉప్పెన’ తో మెగా కాంపౌండ్ నుండి  వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 2న రిలీజవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే రెండో సినిమా పట్టేసాడు.  నెక్స్ట్ నందిని రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్.

లేటెస్ట్ గా ‘ఓ బేబీ’ తో సూపర్ హిట్ అందుకున్న నందిని రెడ్డి స్వప్న సినిమాస్ బ్యానర్ లో ఓ లవ్ స్టోరీ తెరకెక్కించనుంది. ఆ సినిమాలోనే వైష్ణవ్ ను హీరోగా సెలెక్ట్ చేసారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.