మహానటి ఫస్ట్ వీక్ కలెక్షన్ - బ్లాక్ బస్టర్

Thursday,May 17,2018 - 09:18 by Z_CLU

సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది మహానటి సినిమా. మేటి నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రతి తెలుగు ప్రేక్షకుడికి కనెక్ట్ అయింది. అలా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ 19 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల షేర్ రాబట్టింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో మహానటి సినిమాకు ఇవాళ్టి నుంచి థియేటర్లు పెంచారు. యూఎస్ లో అదనంగా 17 స్క్రీన్స్ కేటాయించారు. సింగపూర్, దుబాయ్ లో కూడా స్క్రీన్స్ పెంచారు. ఇక నార్త్-ఇండియాలో ముంబయి, పూణె, ఢిల్లీ లాంటి ఏరియాస్ నుంచి కూడా మహానటికి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

ఏపీ,నైజాం 7 రోజుల షేర్
నైజాం – రూ. 4.83 కోట్లు
సీడెడ్ – రూ. 1 కోటి
ఉత్తరాంధ్ర – రూ. 1.35 కోట్లు
ఈస్ట్ – రూ. 0.78 కోట్లు
వెస్ట్ – రూ. 0.51 కోట్లు
గుంటూరు – రూ. 0.83 కోట్లు
కృష్ణా – రూ. 1.02 కోట్లు
నెల్లూరు – రూ. 0.26 కోట్లు