విశాల్ మ్యాజిక్ టాలీవుడ్ లో పనిచేస్తుందా..?

Thursday,May 17,2018 - 10:03 by Z_CLU

విశాల్ అభిమన్యుడు ఈ నెల లాస్ట్ వీక్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. ‘ఇరుంబుతెరై’ అనే  టైటిల్ తో తమిళంలో రిలీజైన ఈ సినిమా తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ అదే రేంజ్ లో సక్సెస్ అవుతుందా..? లేకపోతే బాక్సాఫీస్ దగ్గర జస్ట్ ఆవరేజ్ టాక్ తో క్లోజ్ అవుతుందా అనే క్యూరియాసిటీ టాలీవుడ్ లో క్రియేట్ అవుతుంది.

రీసెంట్ గా U/A సర్టిఫికెట్ తో సెన్సార్ క్లియరెన్స్ పొందిన ఈ సినిమాలో విశాల్ సరసన సమంతా హీరోయిన్ గా నటించింది.  సైబర్ క్రైమ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విశాల్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ రోల్ ప్లే చేశాడు. భారీ టెక్నికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ కానున్నాయి.

 

యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి P.S. మిత్రన్ డైరెక్టర్. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఎగ్జాక్ట్ సినిమా రిలీజ్ డేట్ తెలియాల్సి ఉంది.