పాటలతో సిద్ధమైన లక్కున్నోడు

Thursday,January 05,2017 - 08:01 by Z_CLU

మంచు విష్ణు, హన్సిక జంటగా నటించిన సినిమా `లక్కున్నోడు`. గతంలో గీతాంజ‌లి, త్రిపుర వంటి హారర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన డైరక్టర్ రాజ్ కిర‌ణ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహించాడు. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. జనవరి 9న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సినిమా పాటల్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి అచ్చు సంగీతం అందించాడు.

ల‌వ్ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైనర్‌గా లక్కున్నోడు సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచు విష్ణు సరికొత్త లుక్ లో ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాతో ఈ ఇయర్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు మంచువారబ్బాయ్ విష్ణు. ఫిబ్రవరి 3న లక్కున్నోడు సినిమా థియేటర్లలోకి రానుంది.