బాక్సాఫీస్ దుమ్ముదులపడానికి రెడీ...

Thursday,January 05,2017 - 06:45 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడా.. ఎలాంటి సినిమాతో వెండితెరపైకొస్తాడా అని ఎదురుచూసిన అశేష అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా రెడీచేశాడు చిరంజీవి. మొన్నటివరకు సాంగ్స్ తో హల్ చల్ చేసిన ఈ సినిమాకు సంబంధించి, ఈరోజు నుంచి సరికొత్త ప్రచారం షురూ అయింది.

khaidi-making-4

ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మేకింగ్ వీడియోస్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ఫస్ట్ ఎటెంప్ట్ లో భాగంగా ఏకంగా ఫైట్ మేకింగ్ వీడియోనే విడుదల చేసి మెగాఫ్యాన్స్ లో ఉత్సాహం నింపాడు చిరంజీవి.

khaidi-making-5

ఈ వీడియోలో చిరంజీవి గ్రేస్, స్టయిల్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. లెక్కలేనన్ని క్లిక్స్, లైక్స్, వ్యూస్ తో తమ ప్రేమను చూపిస్తున్నారు. ఈ ఒకే ఒక్క మేకింగ్ వీడియోతో సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేశాాడు చిరు.

khaidi-making-3

మరికొన్ని గంటల్లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఉందనగా, ఈ వీడియోను విడుదల చేయడం నిజంగా సంక్రాంతి ఫ్లేవర్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందనే ఫీలింగ్ ను కలిగించింది. ఇక ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రోజున థియేట్రికల్ ట్రయిలర్ రిలీజ్ తో పండగను ముందే ప్రారంభించబోతున్నాడు మెగాస్టార్. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా చేస్తున్న నినాదం ఒకటే.. బాస్ ఈజ్ బ్యాక్.