హలో సినిమా లాస్ట్ సాంగ్ షూటింగ్ ప్రారంభం

Tuesday,October 24,2017 - 11:40 by Z_CLU

అఖిల్ హీరోగా నటిస్తున్న హలో సినిమా, ఆఖరి షెడ్యూల్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు సంబంధించి లాస్ట్ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ సాంగ్ కోసం స్పెషల్ సెట్ వేశారు. ఈ పాట కోసం 3 రోజుల నుంచి రిహార్సల్స్ చేస్తున్న అఖిల్, ఈరోజు ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

హలో సినిమాలో ఈ పాటకు చాలా ప్రత్యేకత ఉందంటున్నాడు దర్శకుడు విక్రమ్ కుమార్. సినిమాలో సందర్భానుసారం ఈ పాట వస్తుందని, కావాలని ఇరికించినట్టు ఉండదని అంటున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే దీన్నొక మాంటేజ్ సాంగ్ గాా కూడా చెప్పుకోవచ్చు

ఈ నెలాఖరుకు హలో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. వచ్చేనెల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు ప్రమోషన్ కూడా ప్రారంభించబోతున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న హలో సినిమాను విడుదల చేయబోతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అఖిల్ ఓ పాట కూడా పాడాడు.