'క్షీర సాగర మథనం' ఫస్ట్ లుక్

Saturday,November 30,2019 - 01:37 by Z_CLU

‘క్షీరసాగరమథనం’ అనే అచ్చ తెలుగు పేరుతో రూపొందిన చిత్రం మెల్లగా సందడి చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రముఖ యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్రం టైటిల్ ను విడుదల చేయగా- ఇప్పుడు తాజాగా… వరుస విజయాలతో దూసుకుపోతున్న మరో యువ కథానాయకుడు అడివి శేష్ ‘క్షీరసాగరమథనం’ పోస్టర్ ను లాంచ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

శేఖర్ కమ్ముల మొదలుకుని గౌతమ్ తిన్ననూరి వరకు పలువురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ టర్న్ డ్ ఫేమస్ డైరెక్టర్స్ లా.. సినిమా రంగంలో తనదైన ముద్ర వేయాలనే ‘అనిల్ పంగులూరి’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఝలక్, గ్రీన్ సిగ్నల్, ప్రేమికుడు సోడా గోలిసోడా వంటి చిత్రాలలో హీరోగా నటించి తన ప్రతిభను ప్రకటించుకున్న మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షిత హీరోయిన్. ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు.