బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా

Saturday,November 30,2019 - 10:03 by Z_CLU

బాలయ్య-బోయపాటి
ఈ కాంబినేషన్ పై ఉండే అంచనాలు వేరు, వీళ్ల ప్రాజెక్టు లెక్కలు వేరు. బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బస్టర్స్ కొట్టిన కాంబో ఇది. ఇప్పుడీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి వినిపిస్తున్న బడ్జెట్ మాత్రం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అవును.. బోయపాటి-బాలయ్య సినిమా కోసం అక్షరాలా 60 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారట. కథ ప్రకారం ఈమాత్రం బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మామూలుగానే బోయపాటి సినిమాల్లో కాస్త ఖర్చు కనిపిస్తుంది. అలాంటిది బాలయ్యతో సినిమా అంటే బడ్జెట్ లిమిట్స్ దాటడం కామన్.

ప్రస్తుతం ఫిలింనగర్ లో వినిపిస్తున్న ఈ గాసిప్ నిజమైతే మాత్రం.. బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా ఇది నిలిచిపోతుంది. అన్నట్టు ఈ సినిమా కోసం బాలయ్య ఓ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ 9న బాలయ్య-బోయపాటి సినిమా లాంఛ్ అవుతుంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.