Krish-VaishnavTej కొత్త సినిమా అప్ డేట్స్

Tuesday,August 18,2020 - 05:20 by Z_CLU

మెగా మేనల్లుడు Vaishnav Tej హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇటివలే పూజా కార్యక్రమాలతో మొదలైంది. ప్రస్తుతం వికారాబాద్ ఫారెస్ట్ లో షూట్ జరుగుతుంది. హీరోపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. వచ్చే నెల నుంచి హీరోయిన్ సెట్స్ లో జాయిన్ అవుతుంది.

 30 రోజుల తర్వాత నల్లమల ఫారెస్ట్ లో ఓ 10 రోజులు షూట్ చేయనున్నారు. టోటల్ గా 40 డేస్ సింగిల్ షెడ్యుల్ లో ఈ సినిమాను కంప్లీట్ చేయబోతున్నాడు Director Krish

వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ (RakulPreeth) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు MM Keeravani సంగీతం అందిస్తున్నారు. First Frame Entertainments బ్యానర్ పై సాయి బాబా జాగర్లపూడి , రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను రిలీజ్ అవకాశం ఉంది.