టాక్సీరాణితో రాజావారు

Thursday,February 06,2020 - 01:03 by Z_CLU

టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్.. ఆ సినిమాతో టాక్సీరాణి అనిపించుకుంది. ఇక రాజావారు రాణిగారు సినిమాతో హీరో కిరణ్ అబ్బవరం కూడా రాజావారు అనిపించుకున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి సినిమా స్టార్ట్ చేశారు.

ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా సినిమా లాంఛ్ అయింది. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మదనపల్లి ఎమ్ఎల్ఏ నవాజ్ బాషా క్లాప్ కొట్టారు. ఈ సినిమాతో శ్రీధర్ గదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు ఆర్ఎక్స్-100 మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈనెల లాస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తారు.

నటీనటులు:
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవల్కర్, డైలాగ్ కింగ్ సాయి కుమార్, తులసి, శ్రీకాంత్, కశ్యప్ శ్రీనివాస్, అరుణ్

సంగీతం: చేతన్ భరద్వాజ్
కెమెరామెన్: విశ్వాస్ డానియల్
దర్శకత్వం: శ్రీధర్ గదె
నిర్మాతలు: ఎలైట్ గ్రూప్