మహానటి మే 9న రిలీజ్

Sunday,March 18,2018 - 09:41 by Z_CLU

లెక్కప్రకారం.. మార్చి 29న రిలీజ్ అవ్వాలి మహానటి సినిమా. కానీ ఈ మూవీకి సంబంధించి కొత్త విడుదల తేదీ ఫిక్స్ చేశారు. మే 9న మహానటి సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించి మరో స్టిల్ రిలీజ్ చేసి, రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు. సావిత్రి బయోపిక్ గా వస్తున్నమహానటి సినిమాలో కీర్తిసురేష్ లీడ్ రోల్ పోషిస్తోంది.

తెలుగుతెరపై చెరగని ముద్రవేసిన ఒకప్పటి హీరోయిన్ సావిత్రి అంటే ఇప్పటికీ అభిమానిస్తూ, గుర్తుంచుకున్న వారు, ముఖ్యంగా మహిళలు చాలామంది వున్నారు. వారంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పైగా మాయాబజార్ లోని వివాహ భోజనంబు పాటను, ఆ సెట్ ను ఈ సినిమా కోసం రీ-క్రియేట్ చేస్తున్నారు. అవన్నీ కాస్త ఆసక్తికరమైన సంగతులే.

ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి వైవిధ్యమైన సినిమాను అందించిన నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్వప్న సినిమా బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై సమర్పిస్తున్నారు.