శబ్దం: నారా రోహిత్ కొత్త సినిమా ప్రారంభం

Sunday,March 18,2018 - 10:17 by Z_CLU

ఫస్ట్ టైం తన కెరీర్ లో మూగవాడి పాత్రలో కనిపించబోతున్నాడు నారా రోహిత్. ముంజునాథ్ డైరక్షన్ లో ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడీ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. ఉగాది సందర్భంగా శబ్దం అనే టైటిల్ తో నారా రోహిత్ 18వ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. అంతేకాదు.. ఈరోజు మంచి రోజు కావడంతో షూటింగ్ కూడా ప్రారంభించారు.

వికాస్ కురిమెళ్ళ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి నారాయణ రావు అట్లూరి దర్శకుడు. శ్రీ వైష్ణవీ క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో హీరోయిన్ల వివరాల్ని ఇంకా వెల్లడించలేదు. హీజ్ సైలెన్స్ ఈజ్ హిజ్ వెపన్ (మౌనమే అతడి ఆయుధం) అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.