బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో

Friday,April 03,2020 - 04:33 by Z_CLU

‘మహానటి’ సినిమాతో ఉత్తమ కథానాయికగా నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ నుండి గతేడాది ఒక్క సినిమా కూడా రాలేదు. అవును కేవలం ‘మన్మథుడు 2’ లో ఓ గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపించింది కీర్తి. అయితే ఈ ఏడాది మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది ఈ చెన్నై బ్యూటీ..

ప్రస్తుతం కీర్తి చేతిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. అందులో ఒకటి ‘మిస్ ఇండియా’ కాగా మరొకటి నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ‘రంగ్ దే’. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మిస్ ఇండియా అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

రంగ్ దే సినిమాలో అను అనే మోడ్రన్ అమ్మాయి పాత్ర పోషిస్తోంది కీర్తి. పూర్తిగా లవ్ ఎలిమెంట్స్ తో వచ్చే ఈ సినిమాలో తన క్యారెక్టర్ అందర్నీ ఆకట్టుకుంటుందనే ధీమాతో ఉంది. అటు మిస్ ఇండియా సినిమా అయితే పూర్తిగా కీర్తిసురేష్ చుట్టూ తిరిగే కథ. ఈ రెండు సినిమాలతో మరోసారి టాలీవుడ్ లో తన సత్తా చూపించబోతోంది కీర్తిసురేష్.