'రంగ్ దే'... Perfect Love Story

Friday,April 03,2020 - 01:42 by Z_CLU

లేటెస్ట్ గా ‘భీష్మ’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నితిన్ నెక్స్ట్ ఓ పర్ఫెక్ట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అవును.. ప్రస్తుతం నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రంగ్ దే’ కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తోంది. ప్యూర్ లవ్ స్టోరీతో ‘ఇష్క్’ తరహాలో ఈ సినిమా ఉండనుందని సమాచారం.

అందుకే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పీ.సీ.శ్రీరామ్ ను ఎంచుకున్నారు మేకర్స్. సినిమాలో నితిన్, కీర్తి సురేష్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ తో పాటు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బిగ్ ఎస్సెట్ అని ఇన్ సైడ్ టాక్.

ఇక నితిన్ కూడా కంప్లీట్ లవ్ స్టోరీతో హిట్ కొట్టి చాన్నాళ్లయింది. అందుకే ‘రంగ్ దే’ తో మళ్ళీ లవర్ బాయ్ గా మెప్పించి ఈ ఏడాది మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను ఇప్పటికే రెండు లవ్ స్టోరీస్ తెరకెక్కించిన వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు.