కత్రినా కైఫ్ పెళ్లి కబుర్లు

Saturday,February 02,2019 - 12:00 by Z_CLU

సినీ పరిశ్రమలో 30, 35 ఏళ్లు పైబడిన హీరోయిన్లను ఎవరినైనా.. మీడియా తరచుగా అడిగే ప్రశ్నల్లో పెళ్లి ప్రస్తావన కూడా ఒకటి. ఇటీవలే పెళ్లి చేసుకున్న దీపికా పదుకునె, ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, సోనమ్ కపూర్ వంటి హీరోయిన్స్ అంతా తమ పెళ్లికి ముందు అలా ఆ ప్రశ్నలను ఎన్నోసార్లు ఎదుర్కున్న వాళ్లే. అలాగే కత్రినా కైఫ్‌కు సైతం ఎక్కడికెళ్లినా ఆమెకు ఎదురవుతున్న ప్రశ్నల్లో పెళ్లికి సంబంధించిన ప్రస్తావన తప్పకుండా ఉంటోంది. తాజాగా ఆమె పెళ్లిపై చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.

”పెళ్లి అనేది ఇద్దరు మనుషులకు సంబంధించిన విషయం కానీ ఒక్కరితో సాధ్యపడేది కాదు కదా” అని ఎదురు ప్రశ్నిస్తూనే.. ప్రస్తుతానికి అలా తన జీవితంలో ఎవ్వరూ లేరని, అలా ఎవరైనా వచ్చినప్పుడు అదే అవుద్దని తెలివైన సమాధానం ఇచ్చింది.

”పెళ్లి అనేది ఏదో కావాలని ఆలోచించే విషయం కాదు.. చేసుకునే పని” అని స్పష్టంచేసిన కత్రినా.. తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని చెప్పకనే చెప్పేసిందన్నమాట!