Kalapuram Teaser - స్వీట్ అండ్ ఫన్నీ

Saturday,August 06,2022 - 03:11 by Z_CLU

Karuna Kumar’s Kalapuram Teaser Revealed

‘పలాస 1978’తో ప్రేక్ష‌కులే కాదు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్‌. ఆ త‌ర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి రా అండ్ ర‌స్టిక్ కాన్సెప్ట్ చిత్రంతో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు ఈ డైరక్టర్. ఇప్పుడు కామెడీ డ్రామా ‘క‌ళాపురం’ చిత్రంతో మెస్మరైజ్ చేయడానికి సిద్ధ‌మ‌య్యాడు.

జీ స్టూడియోస్‌స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌జనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, ర‌క్షిత్ అట్లూరి త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. క‌రుణ కుమార్ గ‌త రెండు చిత్రాల‌కు భిన్నంగా క‌ళాపురం సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ ఊరిలో అంద‌రూ క‌ళాకారులే అనేది సినిమా క్యాప్ష‌న్‌.

ఈరోజు కళాపురం టీజర్ ను గ్రాండ్ గా లాంఛ్ చేశారు. సినిమాలో కీలకమైన క్యారెక్టర్స్ అన్నింటినీ బ్యాక్ టు బ్యాక్ పరిచయం చేశారు. అన్నీ పాత్ర‌లు చాలా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తున్నాయి. కొన్ని చమక్కులు, మరికొన్ని కామెడీ పంచ్ లతో కళాపురం టీజర్ ఎట్రాక్ట్ చేస్తోంది.

సిట్యువేష‌న‌ల్ కామెడీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్ ఈ సినిమాతో సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమాను ఆగ‌స్ట్ 26న విడుద‌ల చేస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.