Kalapuram మెప్పించడానికి చిన్న సినిమా రెడీ !

Wednesday,August 24,2022 - 05:44 by Z_CLU

‘Kalapuram’ A small film ready to entertain audience

‘పలాస’, శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు క‌రుణ కుమార్  మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి విభిన్నమైన కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో  ‘కళాపురం’ తెరకెక్కించాడు. ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ అనే  క్యాప్షన్ తో రూపొందిన ఈ కామెడీ డ్రామా సినిమా ఆగస్ట్ 26న రిలీజ్ అవ్వబోతుంది.

 ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌, ఆర్ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌జనీ తాళ్లూరి కళాపురం సినిమాను నిర్మించారు. స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, త‌దిత‌రులు న‌టించారు. సినిమానే జీవితమనుకునే కొందరు వ్యక్తులు కలిసి కళాపురంలో ఓ సినిమా తీయాలనుకోవడం , మధ్యలో కొన్ని ఊహించని సంఘటనలు జరగడంతో నేచురల్ కామెడీ డ్రామా విత్ క్రైం ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఆసక్తిగా తెరకెక్కిన ఈ సినిమాను తాజాగా వైజాగ్ లో ప్రీమియర్ వేశారు.

సినిమా చూసిన వైజాగ్ ఆడియన్స్ ‘కళాపురం’ మెప్పించింది అంటూ చెప్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న కళాపురం అందరినీ ఆకట్టుకోవడం ఖాయమంటూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. కళాపురం చిన్న సినిమాగా రిలీజై ఆగస్ట్ 26 న పెద్ద హిట్ అందుకోవడం ఖాయమనిపిస్తుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics