Karthikeya 2: మరికొన్ని గంటల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Saturday,November 19,2022 - 10:21 by Z_CLU

Karthikeya 2 World Television Premiere on Zee Telugu

నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha) లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ ‘కార్తికేయ 2’ (Karthikeya2) వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థియేటర్స్ లో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చి లేటెస్ట్ గా ZEE5 లో భారీ వ్యూస్ కొల్లగొట్టి ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా నవంబర్ 20న సాయంత్రం 6గంటలకు జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అవుతుంది.

చందూ మొండేటి దర్శకుడిగా కృష్ణ తత్వంతో మైథలాజికల్ డ్రామాగా తెరక్కిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ను కూడా విపరీతంగా మెస్మరైజ్ చేసింది. నిఖిల్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది.

నిఖిల్ యాక్టింగ్ , అనుపమ క్యారెక్టర్, ట్రెజర్ హంట్ కాన్సెప్ట్, ఆసక్తిగా సాగే కథనం, అదిరిపోయే విజువల్స్, కాల భైరవ టెర్రిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్స్. ఈ విజువల్ వండర్ టీవీ లో ఎక్స్ పీరియన్స్ చేసి మంచి అనుభూతి పొందండి.

Epic Blockbuster #Karthikeya2 World Television Premiere on 20th November, Sunday at 6PM on ZeeTelugu