టాప్-5 సినిమాల జాబితాలో చేరిన కాంచన-3

Tuesday,April 30,2019 - 04:28 by Z_CLU

వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అయిన కాంచన-3 సినిమా మరో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 సౌత్ సినిమాల జాబితాలోకి కాంచన-3 కూడా చేరింది. విడుదలైన 11 రోజుల్లో వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా 2019 టాప్-5 మూవీస్ లిస్ట్ లో ఎంటరైంది.

కోలీవుడ్ లో ఈ ఏడాది వంద కోట్లు గ్రాస్ సాధించిన మూడో సినిమాగా కాంచన-3 నిలిచింది. ఇక లారెన్స్ కెరీర్ లో చూసుకుంటే ఇది రెండో వంద కోట్ల చిత్రం. గతంలో కాంచన-2 మూవీ కూడా వంద కోట్లు కలెక్ట్ చేసింది. కాంచన-3 కంటే ముందు వంద కోట్ల క్లబ్ లో పేట, విశ్వాసం, ఎఫ్-2, లూసిఫర్ సినిమాలున్నాయి.

ప్రస్తుత కాంచన-3 సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇప్పుడున్న ట్రెండ్ ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల్లో ఇది లూసిఫర్, ఎఫ్-2 వసూళ్లను క్రాస్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.