కొత్త సినిమా స్టార్ట్ చేసిన కళ్యాణ్ రామ్

Wednesday,April 25,2018 - 10:56 by Z_CLU

కళ్యాణ్ రామ్ హీరోగా  కే.వి.గుహన్(సినిమాటోగ్రాఫర్) డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. జూ.ఎన్టిఆర్ క్లాప్ నివ్వగా నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నందమూరి రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన  నివేత థామస్,శాలిని పాండే హీరోయిన్స్ గా నటిస్తుండగా… ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ సినిమా నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా మే 2 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.