Kalyan Ram ఆ ఆలోచనే లేదు !

Wednesday,July 27,2022 - 06:22 by Z_CLU

Kalyan Ram responded about his Direction Debut

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా , నిర్మాతగా మంచి విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకులతో నిర్మాతగా అయన చేసిన ప్రయోగాలు చాలానే ఉన్నాయి. కానీ ఇంతవరకూ కళ్యాణ్ రామ్ దర్శకత్వం మాత్రం చేయలేదు. అసలు కళ్యాణ్ కి డైరెక్షన్ మీద ఆసక్తి ఉందా ? లేదా అనేది ఎప్పటి నుండో ప్రేక్షకుల్లో ఓ ప్రశ్నగా మిగిలిపోయింది. తాజాగా కళ్యాణ్ రామ్ కి మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు ? అనే ప్రశ్న ఎదురైంది.

‘బింబిసార’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన కళ్యాణ్ రామ్ ఆ ప్రశ్నకు స్పందిస్తూ ” అసలు ఆ ఆలోచనే లేదు. డైరెక్షన్ అనేది చాలా బరువైన బాధ్యత. అది అందరూ మోయలేరు. పైగా దానికి రైటింగ్ స్కిల్స్ చాలా ముఖ్యం. రాయడం , తీయడం అంటే మాములు విషయం కాదు అందుకే నేను ఆ సైడ్ వెళ్ళాలనుకోవడం లేదు. అలాగే నిర్మాణం మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టడం లేదు. అటు సైడ్ కూడా వర్క్ తగ్గించుకున్నాను. కేవలం ఫోకస్ పెడుతూ సినిమాలు చేస్తున్నాను” అన్నారు.

అలాగే మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో చేస్తున్న సినిమా షూట్ కంప్లీట్ అయ్యిందని త్వరలోనే ఆ సినిమా రిలీజ్ ఉంటుందని అలాగే డెవిల్ సినిమా షూటింగ్ స్టేజిలో ఉందని చెప్పుకున్నాడు.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics