Kalyan Ram డెవిల్ స్టోరీ ఇదేనా ?

Thursday,April 13,2023 - 02:27 by Z_CLU

Kalyan Ram picked up an interesting story line for ‘Devil’

నందమూరి కళ్యాణ్ రామ్ అప్ కమింగ్ మూవీ డెవిల్. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. డెవిల్‌ను అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కథాంశం గురించి తాజాగా ఓ అప్ డేట్ బయటికొచ్చింది. బ్రిటిష్ కాలం నాటి పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో డెవిల్ అనే సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు.

సినిమాలో ప్రధాన కథాంశం జపాన్‌లో విమానం కూలిపోయి మరణించినట్లు భావించిన సుభాష్ చంద్రబోస్ మరణం చుట్టూ ఉంటుందట. అయితే అసలు అతను చనిపోయాడా? మరి సుభాష్ చంద్రబోస్‌తో డెవిల్‌కు సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం సినిమా క్లైమాక్స్‌లో దొరుకుతుందని తెలుస్తుంది.

హై టెక్నికల్‌ వాల్యూస్‌తో భారీ ఎత్తున ఈ సినిమా రూపొందుతోంది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ స్పై థ్రిల్లర్‌కి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్‌ప్లే ,సంభాషణలు అందించారు.