అదాశర్మ కి మళ్ళీ కలిసి రాలేదు...

Thursday,July 04,2019 - 12:03 by Z_CLU

‘కల్కి’ సినిమా నుండి అదాశర్మ ఫస్ట్ లుక్ రిలీజైనప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది. సినిమాలో డాక్టర్ రోల్ ప్లే చేస్తుందనగానే అదాశర్మ కరియర్ ఆల్మోస్ట్ ట్రాక్ పై పడ్డట్టే అనుకున్నారంతా.. కానీ అనుకున్నట్టు జరగలేదు ‘కల్కి’ అదా ని మళ్ళీ సేమ్ ప్లేస్ లో నిలబెట్టేసింది.

పూరి జగన్నాథ్ హీరోయిన్… ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో లాంచ్ అయింది టాలీవుడ్ లో. నిజానికి అదే టెంపో మెయిన్ టైన్ చేస్తే అదాశర్మ కరియర్ నెక్స్ట్ లెవెల్  లో ఉండేది. కానీ సరైన సక్సెస్ లేక, ఎంత ఈజీగా స్టార్ ఇమేజ్ అందుకుందో అంతే ఫాస్ట్ గా డ్రాప్ అయింది.

అప్పుడెప్పుడో ‘క్షణం’ సినిమాలో నటించిన అదాశర్మ మళ్ళీ ఇంకో తెలుగు సినిమాలో కనిపించలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు ‘కల్కి’ లో కనిపించినా, డాక్టర్ పద్మగా తన ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో మాత్రం మళ్ళీ బోల్తా పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్స్ తో కాంపిటీటివ్ గా ఉండటంలో అదా శర్మ 100% మళ్ళీ విఫలమైంది.   

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండే అదా, కరియర్ కి ప్లస్ అయ్యే సినిమాలను ఎంచుకోవడంలో మాత్రం చేసిన తప్పే రిపీటెడ్ గా చేస్తుంది. చూడాలి మరీ.. ‘కల్కి’ నేర్పిన అనుభవం అదాని ఎక్కడ నిలబెడుతుందో…